చిరుతో మంచు హీరోల బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్.. విషయం ఏమిటో ?

చిరుతో మంచు హీరోల బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్.. విషయం ఏమిటో ?

Published on Dec 24, 2020 3:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్యన మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. చిరు, మోహన్ బాబులు అన్నదమ్ముల్లా ఉంటారు. పలుసార్లు వేదిక మీదనే ఇరువురు తమ అనుబంధం గురించి గొప్పగా చెప్పుకున్న సందర్భాలు అనేకం. అయితే తాజాగా మంచి విష్ణు, మోహన్ బాబు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు చిరును కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ షూటింగ్లో ఉన్నారు. నిన్న విష్ణు మెగాస్టార్ వద్దకు వెళ్లారు. ఆ ఫోటోను ట్వీట్ చేసిన విష్ణు బిగ్ బాస్ ను ఎందుకు కలిసింది త్వరలోనే రివీల్ చేస్తానని అన్నారు. దీంతో పేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది.

దాన్ని రెట్టింపు చేస్తూ ఈరోజు మోహన్ బాబు సైతం చిరును కలిశారు. ‘ఆచార్య’ సెట్ కు వెళ్లి తన మిత్రుడికి బొకే ఇచ్చి సంభాషణ జరిపారు. ఇలా మోహన్ బాబు, విష్ణు ఒకరి తర్వాత ఒకరు చిరుతో సమావేశం కావడంతో విషయం చాలా ముఖ్యమైనదని స్పష్టమవుతూనే ఉంది. పైగా విష్ణు త్వరలో రివీల్ చేస్తానని అనడంతో సినిమాల గురించే అయ్యుంటుందని రూఢీ అవుతోంది. మరి అది ఎవరి సినిమా గురించి అయ్యుంటుందనేది తేలాల్సి ఉంది. అంతేకాదు చిరు, మంచు హీరోలు కలిసి సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనే ఆసక్తికరమైన ప్రశ్నలు మెదులుతున్నాయి ప్రేక్షకుల్లో. మరి విషయం ఏమిటనేది విష్ణు నుండే క్లారిటీ రావాలి.

తాజా వార్తలు