అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మనం’. ఆడియన్స్ ఈ సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి విక్రం కుమార్ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో శ్రియ సరన్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జూలై 19 నుంచి మొదలవుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాతో నాగ చైతన్య – సమంత మూడోసారి కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య – సమంతల కెమిస్ట్రీ, అలాగే నాగార్జున – శ్రియల కెమిస్ట్రీ హైలైట్ అవుతుందని అంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ రాస్తున్నాడు.