టాలీవుడ్లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 కోసం యావత్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు. ఇక ఈ గ్లోబ్ ట్రాటరింగ్ చిత్ర షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతుంది.
కాగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 15న SSMB29 నుండి థండరింగ్ అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక ఈ అప్డేట్ ఏమిటా.. ఎలా ఉండబోతుందా.. అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ అప్డేట్పై హైప్ పెంచుతూ మేకర్స్ తరుచూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. రీసెంట్గా మహేష్, రాజమౌళి మధ్య సాగిన ట్వీట్ కన్వర్జేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది.
ఇక ఇప్పుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ కూడా SSMB29 పై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. సినిమాను సెలబ్రేట్ చేసుకునే సిటీ హైదరాబాద్ వేదికగా SSMB29 థండరింగ్ ట్రీట్‌ను రెడీ చేస్తున్నామని.. రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుండి ఈ ట్రీట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఆయన ఓ వీడియో రూపంలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోతో మహేష్ ఫ్యాన్స్ మరోసారి SSMB29ను ట్రెండ్ చేస్తున్నారు.
The time is near….what better place to celebrate this big moment than at the heart of TELUGU CINEMA? ????
So much love, so much excitement and it’s all for you on Nov 15th at Ramoji Film City…
The world will revolve around #GlobeTrotter now… ????#GlobeTrotterEvent @JioHotstar pic.twitter.com/VETD4BiP1N
— S S Karthikeya (@ssk1122) November 5, 2025


