నవదీప్ మరియు సదా ప్రధాన పాత్రలలో ఒక థ్రిల్లర్ చిత్రం రానుంది. “మైత్రి” గా రానున్న ఈ చిత్రానికి సూర్య రాజు దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని రాజేష్ కుమార్ నిర్మించారు. మాములుగా వచ్చే ప్రేమ కథల్లా కాకుండా ఈ చిత్రాన్ని రోమాన్స్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.ఈ చిత్రానికి వికాస్ సంగీతం అందించగా సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. థ్రిల్లర్ చిత్రానికి సెన్సార్ నుండి ఏ సర్టిఫికేట్ అందుకునే అవకాశాలే ఎక్కువ అలాంటిది ఈ చిత్రం యు/ఏ అందుకోడం ఆసక్తికరమైన విషయం. ఈ చిత్రం నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్ర విజయం గురించి నిర్మాతలు ధీమాగా ఉన్నారు.