మైదాన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్డ్

మైదాన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్డ్

Published on Feb 3, 2020 10:27 PM IST

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు అమిత్ శర్మ తెరకెక్కిస్తున్న చిత్రం మైదాన్. పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫుట్ బాల్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా అజయ్ దేవ్ గణ్ కోచ్ పాత్ర చేస్తున్నారు. ఫుట్ బాల్ కోచ్ గా అజయ్ దేవ్ గణ్ లుక్స్ సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన సెకండ్ లుక్ లో చేతిలో హ్యాండ్ బ్యాగ్, గొడుగు పట్టుకొని కాలితో బాల్ ని తంతున్న అజయ్ దేవ్ గణ్ లుక్ ఆసక్తికరంగా ఉంది. యధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఒకప్పుడు ఇండియాలో ఫుట్ బాల్ వైభవం ఎలా ఉండేదో తెలియజేస్తూ మైదాన్ చిత్రం ఉండనుంది. ఇక ఈ చిత్రంలో ప్రియమణి ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. కాగా నేడు మైదాన్ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. 2020 డిసెంబర్ 11న మైదాన్ మూవీ విడుదల కానుంది. జీ స్టూడియోస్ మరియు హనీ కపూర్ సంయుక్తంగా మైదాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు