సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1 – నేనొక్కడినే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెల్ఫాస్ట్ లో జరుగుతోంది. అక్కడ సినిమా షూటింగ్ బాగా వేగంగా జరుగుతోందని సమాచారం. ఈ సినిమాని నార్త్ ఐర్లాండ్, లండన్ లలో వచ్చే నెలలో షూట్ చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన మేజర్ షూటింగ్ పార్ట్ ఈ షెడ్యూల్లో పూర్తవుతుందని ఈ చిత్ర యూనిట్ భావిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సుకుమార్ డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దేవీ కూడా ఈ సినిమాకోసం మొదటి సారిగా ‘హెవీ మెటల్’ జోనర్ సౌండ్స్ ని ఉపయోగించడానికి ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫిట్ లుక్ లో కనిపించనున్నాడు.