రాములమ్మకు మహేష్ బర్త్ డే విషెష్.

లేడీ అమితాబ్ గా సుదీర్ఘ కాలం పరిశ్రమను ఏలిన హీరోయిన్ విజయశాంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించిన ఈ నేషనల్ అవార్డు విన్నర్ విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ అనుభవించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్‌గా మహేశ్ హీరో గా చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషించిన భారతి పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది.

నేడు విజయశాంతి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను అందజేస్తున్నారు. కాగా మహేష్ సోషల్ మీడియా వేదికగా విజయశాంతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘విజయశాంతిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మహేశ్ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. మహేష్ చైల్డ్ ఆర్టిస్టుగా కూడా విజయశాంతితో సినిమాలు చేయడం విశేషం.

Exit mobile version