త్రివిక్రమ్ కు మహేష్ విషెష్ తో ఫాన్స్ లో సరికొత్త డౌట్స్.!

త్రివిక్రమ్ కు మహేష్ విషెష్ తో ఫాన్స్ లో సరికొత్త డౌట్స్.!

Published on Nov 7, 2020 1:22 PM IST

కేవలం మైక్ పట్టుకొని తన మాటలతోనే ఒక దగ్గర ఉన్నవాళ్ళని ఎంతసేపైనా అలాగే ఉంచగలడు. ఈలలు వేసే కుర్రాళ్లతో సైతం తన మాటలోని లోతుతో ఆలోచనలో పడేయగలడు. ఒక పదం అప్పుడు అర్ధం కాకపోయినా దానిలోని ఇంత అర్ధం ఉందా అని తర్వాత రియలైజ్ చేయించగలిగే ఒకే ఒక్కడు అతడే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్నారు. దీనితో త్రివిక్రమ్ తో ఓ సినిమా అంతే ప్రతీ ఒక్కరికీ ఎంతో ఇష్టం ఏర్పడింది.

అలాంటి త్రివిక్రమ్ చేసిన హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఈ ఇద్దరి కాంబోలో రెండు చిత్రాలు చేసారు. బిగ్ స్క్రీన్ పై ఫలితాన్ని పక్కన పెడితే తెలుగు ఆడియెన్స్ ఈ చిత్రాలను ఎన్ని సార్లు అయినా చూస్తాం అంటారు. అలాంటి మ్యాజిక్ ఉంది ఈ కాంబోలో. అలాంటిది వీరి నుంచి ఒక హ్యాట్రిక్ చిత్రం కోసం ఎప్పుడు నుంచో టాక్ వస్తుండగా ఆ మధ్య కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు అవుతుందా అని అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ క్రమంలో నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో మహేష్ విషెష్ చెప్పారు. జస్ట్ విషెష్ మాత్రమే చెప్పి తమ ప్రాజెక్ట్ కోసం జస్ట్ చిన్న ముక్క కూడా చెప్పకపోవడంతో అప్పుడే ఫ్యాన్స్ లో డౌట్స్ మొదలయ్యాయి. వీరి కాంబో ఆల్రెడీ సెట్టయ్యింది కదా అయినా మహేష్ జస్ట్ శుభాకాంక్షలు మాత్రమే చెప్పారేంటి అనుకుంటున్నారు. అంటే వీరి సినిమా ఉన్నట్టా లేనట్టా అని కూడా అనుకుంటున్నారు. మొత్తానికి మాత్రం మహేష్ ట్వీట్ ఇంత పని చేసింది.

తాజా వార్తలు