సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసిందే. అయితే, తాజాగా ఈ సాంగ్ కి సంబంధించిన సెట్ వర్క్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఈ టైటిల్ సాంగ్ సెట్ తీర్చిదిద్దారట. అన్నట్టు సినిమాలో ఓపెనింగ్ సీన్ తరువాత ఈ టైటిల్ సాంగ్ వస్తోందట.
ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందట. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు.
కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.