టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ ”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు – సమంతలపై వచ్చే ఓ పాటను ఈ రోజు నుంచి పూణెలో షూట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ‘దూకుడు’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద అదరహో అనిపించుకుంది. ఇప్పటికే ఎక్కువ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయాలని ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్న మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్ గా నటించింది.\
ఈ సినిమాలో ఈ ఇద్దరి స్టార్ హీరోలకి తల్లి తండ్రులుగా ప్రకాష్ రాజ్ – జయసుధ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం డిసెంబర్ 15న నానక్రాంగూడా లోని రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది.