మహేష్ క్రేజీ ప్రాజెక్ట్ ఉంది కానీ..మరో విధంగానా.?

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ అదే పరంపరను కొనసాగించాలని దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ ను లైన్ లో పెట్టారు. ఇక దీని తర్వాత కూడా మహేష్ చెయ్యబోయే సినెమాలకు సంబంధించి క్లారిటీ వినిపిస్తూనే ఉంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్ట్ బహుశా ఉంటే వంశీ పైడిపల్లితో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంటుంది అని టాక్ వచ్చింది. మరి లేటెస్ట్ గానే మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా లైన్ లోకి వచ్చింది. అదే తన కెరీర్ లో మొట్ట మొదట మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం “ఒక్కడు”.

మరి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది. అలాగే ఈ చిత్ర నిర్మాత ఎం ఎస్ రాజు ఇటీవలే తమ కాంబోలో మళ్ళీ ఓ సినిమా ఉందని కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఇది ఖచ్చితంగా “ఒక్కడు” సీక్వెల్ అనే ప్రస్తావన వచ్చింది. కానీ అసలు విషయం ఏమిటంటే వీరి ప్రాజెక్ట్ అయితే ఉంది కానీ ఖచ్చితంగా అది ఒక్కడు చిత్రానికి సీక్వెల్ కాదు అన్నట్టే టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version