సంక్రాంతి హీరోలు హాఫ్ సెంచురీ కొట్టారు.

2020 సంక్రాంతి బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇద్దరు బడా హీరోల చిత్రాలు రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ హీరోగా తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. అలాగే బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ భారీ వసూళ్లు అందుకొని టాలీవుడ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

కాగా ఈ రెండు చిత్రాలు 50డేస్ రన్ పూర్తిచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ సంక్రాంతి చిత్రాల సందడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. చాలా కొత్త చిత్రాలు వచ్చినా వీటికి ఆదరణ తగ్గడం లేదు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం.

Exit mobile version