సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘1-నేనొక్కడినే’ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నాడు. మహేష్ బాబు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టాడు. కానీ పూర్తి స్థాయిలో డబ్బింగ్ చెప్పడం ఈ రోజే మొదలు పెట్టాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. అలాగే మహేష్ ఈ సినిమాలో తన ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మూవీ ఆడియో ఆల్బంని ఈ నెల 19న రిలీజ్ చేయనున్నారు.