వచ్చే ఏడాదిలో మహేష్ బాబు – సోనాక్షి సిన్హా మూవీ

Mahesh-Sonakshi
మొదటి సినిమాతోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీసు బాద్షా సల్మాన్ ఖాన్ తో చాన్స్ కొట్టేసిన అందాల భామ సోనాక్షి సిన్హా ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తోంది. ఆమె నటించిన అన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరడంతో ప్రస్తుతం సోనాక్షిని 100 కోట్ల ప్రిన్సెస్ అంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈ భామ తెలుగులో మహేష్ సరసన నటిస్తోందని వార్తలు వచ్చాయి కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇదే విషయాన్ని ఈ భామ ముందు ఉంచితే ‘ వచ్చే ఏడాది తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ సినిమాకి ‘శివం’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి క్రిష్ డైరెక్టర్ అని’ సోనాక్షి సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ‘ఆగడు’ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమా తర్వాత ‘శివం’ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. టాలీవుడ్ ప్రిన్స్ – బాలీవుడ్ ప్రిన్సెస్ జత కడితే స్క్రీన్ పై చూడటానికి కన్నువల పండుగగా ఉంటుంది.

Exit mobile version