టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం SSMB29 పై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి నవంబర్‌లో అదిరిపోయే ట్రీట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే, తాజాగా ఈ ట్రీట్‌పై హైప్ పెంచుతూ మహేష్ బాబు నవంబర్ వచ్చేసింది అంటూ జక్కన్నకు గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే, మహేష్ ట్వీట్‌కు రిప్లైగా జక్కన్న కూడా ఓ ట్వీ్ట్ చేశాడు.
‘అవును.. మరి ఏ సినిమాకు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నావు..?’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
It’s November already @ssrajamouli ????
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025
