మహేష్ బాబు చాలాసిగ్గరి అని అందరికీ తెలుసు. కానీ చాలా మందికి తను క్రికెట్ కి చాలా పెద్ద అభిమాని అని ఎంతో మందికి తెలియదు, మహేష్ బాబు చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు చాలా సీరియస్ గా ఫాలో అవుతారు.
షూటింగ్ లో బిజీగా వున్నా కాని తను స్కోర్ ని తెలుసుకుంటూ వుంటాడు. మహేష్ బాబు చదువుకునే రోజుల్లో తన ఇంట్లో క్రికెట్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవారని నా భార్య చెబుతుందని మహేష్ బాబు బావ సుధీర్ బాబు తెలిపాడు. గతంలో బాడ్మింటన్ ఆటగాడు అయిన సుధీర్ బాబు ప్రస్తుతం కొనసాగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సి సి.ఎల్ ) లోని తెలుగు వారియర్స్ టీం లో వున్నాడు.
మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ షూటింగ్ లో బిజీ గా వున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది.