బాద్షా కి డబ్బింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు

Mahesh-Babu
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని గత రెండు రోజుల క్రితం మేము తెలియజేశాము. ప్రస్తుతం మహేష్ బాబు బాద్షా కి డబ్బింగ్ చెబుతున్నారు. మహేష్ బాబు తన వాయిస్ ఓవర్లో కొన్ని మంచి డైలాగ్స్ చెప్పారు. ఎన్.టి.ఆర్, శ్రీను వైట్ల ఇద్దరూ మహేష్ బాబుకి మంచి ఫ్రెండ్స్.

ఏప్రిల్ 5న భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతున్న ‘బాద్షా’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

Exit mobile version