కర్ణాటకలో “మద్రాసి” షెడ్యూల్

Madrasi
నారా రోహిత్ త్వరలో “మద్రాసి” అనే చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకుంది గత ఏడాది గోకర్ణ వద్ద ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర మూడవ షెడ్యూల్ కర్ణాటకలో మొదలయ్యింది.దాదాపుగా 30% చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ చిత్రంలో నారా రోహిత్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. విజయ్ లింగంనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవి వల్లభనేని నిర్మిస్తున్నారు వెంకట్ సూర్య తేజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిల్లి, గుజరాత్ మరియు అండమాన్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. రధాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.

Exit mobile version