‘అఖండ 2: తాండవం’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈరోస్ ఇంటర్నేషనల్ – 14 రీల్స్ ప్లస్ మధ్య సమస్యలు ఉండటంతో ‘అఖండ 2’(Akhanda 2) చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారమవడంతో మద్రాస్ హైకోర్టు సినిమా రిలీజ్‌కి అనుమతి ఇచ్చింది.
కొత్త రిలీజ్ డేట్ ఇదే..
ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్సులు, డిస్ట్రిబ్యూటర్ల పెండింగ్ చెల్లింపులు పూర్తయితే అఖండ 2(Akhanda 2)ని డిసెంబర్ 12, 2025న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్లు మరియు టికెట్ రేట్ల పెంపు కోసం కూడా టీమ్ మరోసారి దరఖాస్తు చేసింది. ఇక కొత్త రిలీజ్ డేట్‌ను ఏ క్షణంలోనైనా ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
లీగల్ ఇష్యూలు క్లియర్ అవడంతో ప్రమోషన్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందిస్తున్నారు.


