చాలా కాలం గ్యాప్ తర్వాత విలక్షణ నటి మధుబాల ‘అంతక ముందు ఆ తరువాత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధుబాల ఇప్పుడు మరిన్ని సపోర్టింగ్ రోల్స్ చేయడానికి సిద్దమవుతోంది. కానీ ఆమె ఎలాంటి పాత్రల కోసం చూస్తుందో తెలుసా? మధుబాల ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి, ఎదుటి వారిపైన ఈర్ష, కోపం లాంటివి చూపించే పాత్రల కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతోందని సమాచారం. ఇప్పటివరకూ మధుబాల మంచి అమ్మాయి అన్న పాత్రల్లోనే కనిపించి కనువిందు చేసింది. ఇలాంటి మధుబాలకి మన నిర్మాతలు నెగటివ్ రోల్స్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.