మాధవన్ కు హాలీవుడ్ లో అవకాశం

madhavan

‘చెలి’, ‘సఖి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాధవన్ బాలీవుడ్ లో సైతం తన ఉనికి చాటుకున్నాడు. ఇప్పుడు మన మ్యాడీ హాలీవుడ్ లో మొదటిసారిగా నటించడానికి సిద్ధమయ్యాడు. ‘లారా క్రోఫ్ట్ – టాంబ్ రైడర్’, ‘కాన్ ఎయిర్’, ‘బ్లాక్ హాక్ డౌన్’ వంటి సినిమాలను తీసిన సైమన్ వెస్ట్ మాధవన్ ను ‘నైట్ ఆఫ్ ది లివింగ్ డెడ్’ అనే హర్రర్ సినిమాలో తీసుకున్నాడు.

న్యూ యార్క్ నగరంలో ఒక వింత వ్యాధి సంచరిస్తున్న తరుణంలో కొద్దిమంది కలిసి తమ బ్రతుకుని ఎలా సాగించారు అన్నది ఈ సినిమా కధాంశం. ఈ సినిమా త్వరలో మొదలుకానుంది. శిక్షణ కోసం మాధవన్ అమెరికా వెళ్లనున్నాడు

Exit mobile version