ఇప్పుడు వస్తున్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కు గాను భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి దీనితో ఈ టీజర్ మొన్నటి నుంచి యూట్యూబ్ లో నిర్విరామంగా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తుంది.
మరి ఈ హవాకు ఇప్పుడు మన తెలుగు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ “లవ్ స్టోరీ” బ్రేక్ వేసింది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “లవ్ స్టోరీ” నుంచి ఈరోజు ఉదయం విడుదల కాబడ్డ ఈ టీజర్ కేవలం కొన్ని గంటల్లోనే భారీ రెస్పాన్స్ ను అందుకుంది. అంతే కాకుండా అప్పటి వరకు నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తున్న కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ ను వెనక్కి నెట్టి టాప్ లోకి వచ్చేసింది. మరి అంత పెద్ద సెన్సేషన్ ను నమోదు చేసిన ఈ టీజర్ కి ఇది బ్రేక్ వెయ్యడం విశేషమే అని చెప్పాలి.