‘మహేష్’ సినిమా కోసం లాంగ్ షెడ్యూల్ ?

‘మహేష్’ సినిమా కోసం లాంగ్ షెడ్యూల్ ?

Published on Nov 2, 2025 8:08 AM IST

SSMB29

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ కోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండో వారం నుంచి జరగనున్న ఈ లాంగ్ షెడ్యూల్ లో మహేష్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది.

కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్‌ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

తాజా వార్తలు