రీసెంట్ గా మలయాళ సినిమా అందించిన భారీ హిట్ చిత్రమే ‘లోక’. తెలుగులో కొత్త లోక పేరిట రిలీజ్ అయ్యిన ఈ సినిమా మన దగ్గర కూడా బాగానే రాణించింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో దర్శకుడు అరుణ్ డామినిక్ తెరకెక్కించిన ఈ లేడీ సూపర్ హీరో చిత్రం ఇపుడు మలయాళ ఇండస్ట్రీలో కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్టు తెలుస్తుంది.
దీనితో కొత్త లోక సినిమా స్టార్ హీరో మోహన్ లాల్ రీసెంట్ చిత్రం ఎంపురాన్ వసూళ్లు రికార్డు బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్టు మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపురాన్ చిత్రం 268 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంటే లోక చిత్రం ఇప్పుడు వరకు 270 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా మాత్రమే కాకుండా మలయాళ సినిమా దగ్గర మొదటి లేడీ ఓరియెంటెడ్ ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచినట్టు తెలుస్తుంది. మొత్తానికి నిర్మాతగా దుల్కర్ సల్మాన్ ఒక సెన్సేషనల్ ప్రాఫిట్స్ ని ఈ సినిమాతో అందుకున్నాడని చెప్పవచ్చు.