స్టైలిష్ పోస్టర్‌తో ‘లోక చాప్టర్ 2’ ప్రకటన..!

మలయాళంలో తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం ‘లోక చాప్టర్ 1’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. డోమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్‌లో నటించగా, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సెన్సేషనల్ రన్‌తో దూసుకెళ్లింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ‘లోక చాప్టర్ 2’ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో లోక చాప్టర్ 1 చిత్రంలో కేమియో రోల్స్‌లో కనిపించిన టొవీనో థామస్, దుల్కర్ సల్మాన్ మనకు కనిపిస్తున్నారు.

ఇక ఈ పోస్టర్‌తో అప్పుడే సీక్వెల్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సీక్వెల్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version