లండన్ షెడ్యూల్ ముగించుకున్న లెజెండ్

లండన్ షెడ్యూల్ ముగించుకున్న లెజెండ్

Published on Feb 22, 2014 7:12 PM IST

Legend_First_Look1
నందమూరి బాలకృష్ణ లెజెండ్ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతున్న విషయం తెలిసినదే. నేటితో చిత్రబృందం అక్కడ షూటింగ్ ముగించుకుని ఇండియాకు పయనమవుతుంది. ఒక్క పాట, ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ దాదాపు ముగిసింది

ఇటివలే దుబాయ్ లోని ఒక ఎడారి లో చిత్రీకరించిన ఒక పెద్ద ఏక్షన్ సన్నివేశం చాలా బాగా వచ్చిందంట. రాధిక ఆప్టే మరియు సోనాల్ చౌహన్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రం లో జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చ్ 7 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. . బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర , గోపీచంద్, రామ్ ఆచంట మరియు సాయి కొర్రపాటి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మరియు వారాహి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు