మార్చి 7న లెజెండ్ ఆడియో

మార్చి 7న లెజెండ్ ఆడియో

Published on Feb 13, 2014 2:00 PM IST

legend

గత కొద్ది రోజులుగా నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ ఆడియో ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తి మొదలైంది. ఎందుకంటే ఆడియో రిలీజ్ కోసం రెండు మూడు తేదీలు పరిశీలనలో ఉన్నాయి. ఈ వార్తలకి ప్రొడక్షన్ టీం తెరదించింది. మార్చి 7న ‘లెజెండ్’ ఆడియో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసారు. ఈచిత్ర నిర్మాతలు ఈ ఆడియో వేడుక చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా రెండు డిఫరెంట్ గెటప్స్ లో కూడా కనిపించనున్నాడు, అందులో ఒకటి ‘సింహా’ లోని పవర్ఫుల్ పాత్రలా ఉంటుందని అంటున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చోహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు