తన లుక్స్ కి ఆ థెరఫీనే కారణం అంటున్న అమలా పాల్

తన లుక్స్ కి ఆ థెరఫీనే కారణం అంటున్న అమలా పాల్

Published on Sep 1, 2013 2:10 PM IST

Amala-Paul
ఈ సంవత్సరం టాలీవుడ్ లో ‘నాయక్’ సినిమాతో హిట్ అందుకున్న అమలా పాల్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. తన గుడ్ లూక్స్ వెనుక ఉన్న కారణం ఏంటని అమలా పాల్ ని అడిగితే ‘ నా లుక్ మరియు నేను ఎప్పుడూ జోష్ ఫుల్ గా ఉండడానికి కారణం ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మనచుట్టూ పాజిటివ్ వాతావరణం ఉంటుంది, అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను చిన్న చిన్న జోక్స్ కి కూడా బాగా బిగ్గరగా నవ్వుతాను అలా నవ్వడం వల్ల నెగటివ్ ఆలోచనలు మనలో నుండి వెళ్ళిపోతాయని’ లాఫింగ్ తెరఫి గురించి చెబుతోంది.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న అమలా పాల్ త్వరలోనే ‘జెండా పై కపిరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

తాజా వార్తలు