‘బాహుబలి ది ఎపిక్’ టికెట్ ధరలు.. స్పెషల్ షోస్ కూడా?

Baahubali The Epic

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ రీరిలీజ్ చిత్రమే బాహుబలి ది ఎపిక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలూ కలిపి ఒకే సినిమాగా తీసుకొస్తున్న ఈ చిత్రం చూసేందుకు ఆడియెన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే ఈ చిత్రాన్ని ఈ అక్టోబర్ 31న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా అనేక ఫార్మాట్స్ లో కూడా ఈ చిత్రం రాబోతుంది. అయితే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు వినిపిస్తుంది. భారీ సినిమా మళ్ళీ మేకర్స్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ టికెట్ ధరలు లాంటివి పెంచుతారా అనే డౌట్ చాలా మందిలో ఉండొచ్చు కానీ అందులో ఎలాంటి సందేహం పెట్టుకోనక్కర్లేదట.

ఎందుకంటే మొత్తం ఇండియా వైడ్ గా సినిమా కేవలం సాధారణ ధరలతోనే రానుంది అని తెలుస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ టాక్ ఏంటంటే 31న ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ అయినప్పటికీ 29 నుంచే ప్రీమియర్స్ పడతాయని వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version