‘లెనిన్’ కొత్త షెడ్యూల్ కోసం కసరత్తులు !

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ ఏమిటంటే, మేకర్స్ తదుపరి షెడ్యూల్ కోసం తిరుపతికి వెళ్లనున్నారు. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని చెబుతున్నారు. తిరుపతి నగరంలో షూటింగ్ లొకేషన్‌లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – శ్రీలీల కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

Exit mobile version