ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ “రౌద్రం రణం రుధిరం” అనే భారీ మల్టీ స్టార్టింగ్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే దీని తర్వాత మరో క్రేజీ కాంబో త్రివిక్రమ్ తో “అయినను పోయి రావలె హస్తినకు” అనే చిత్రాన్ని సెట్ చేసారు. రాజమౌళితో సినిమా అయ్యాక అది మొదలు కానుంది.
మరి ఈ చిత్రం అయ్యాక తారక్ ఓ సాలిడ్ దర్శకునితో సినిమా చెయ్యనున్నట్టుగా గాసిప్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. కార్తీ తో చేసిన “ఖైదీ” సినిమాతో మన తెలుగు ఆడియెన్స్ దృష్టిలో పడ్డ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ఇప్పుడు “మాస్టర్”తో మరింత హైలైట్ అయ్యాడు. మరి ఈ టాప్ దర్శకునితో తారక్ సినిమా ఉందని గాసిప్స్ గుప్పుమన్నాయి.
మరి ఇందులో అయితే ప్రస్తుతానికి ఎలాంటి నిజమూ లేనట్టే తెలుస్తుంది. ఇదిలా ఉండగా గతంలో ఇదే దర్శకుడు మరియు సూపర్ స్టార్ మహేష్ తో ఓ సినిమా ఉందని సేమ్ ఇలాంటి టాకే బయటకు వచ్చింది ఆవిరి అయ్యిపోయింది. మరి ఇప్పుడు ఈ కాంబో ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.