నందమూరి అభిమానులకి ఎప్పుడు లేని విధమైన దారుణమైన డిజప్పాయింట్మెంట్ ఇప్పుడు ఎదురైన సంగతి తెలిసిందే. నటసింహం బాలకృష్ణ నటించిన సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “అఖండ 2” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఊహించని రీతిలో సినిమా వాయిదా పడడం అది కూడా చివరి నిమిషంలో ఆగడం అనేది ఎప్పటికీ జరగలేదు. దీనితో అఖండ 2 ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.
అయితే మేకర్స్ కి సంబంధించి ఫైనాన్స్ సమస్యలు మూలాన సినిమా ఆగింది అని టాక్ వచ్చింది. అయితే ఇపుడు ఫైనల్ గా ఓ గుడ్ న్యూస్ లేటెస్ట్ గా తెలుస్తుంది. దీని ప్రకారం అఖండ 2 ఫైనాన్స్ సమస్యలు తొలగినట్టు తెలుస్తుంది. రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యింది అని కేవలం ఒక్క క్లియరెన్స్ లెటర్ వస్తే సరిపోద్ది అని టాక్. సో అఖండ 2 కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో దీనిపై అధికారిక క్లారిటీ బయటకి వచ్చి కొత్త రిలీజ్ డేట్ రావాల్సి ఉంది.
