‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. బన్నీ పాత్రలో మూడు కోణాలు ఉంటాయని, పైగా బన్నీ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని.. ఇలా చాలా రకాల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ ఎలా మెరిశారో.. అదే శైలిలో ఈ సినిమాలో కూడా రెండు పవర్ ఫుల్ గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేశారని తెలుస్తోంది.
మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి. ఇప్పుడు ఉన్న అప్ డేట్ ప్రకారం షారుఖ్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తారట. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.