క్రేజీ బజ్: సాహో X ఓజి క్రాసోవర్.. పొరపాటున లింక్ ఉందా..

క్రేజీ బజ్: సాహో X ఓజి క్రాసోవర్.. పొరపాటున లింక్ ఉందా..

Published on Sep 23, 2025 2:30 PM IST

og-and-saaho

ప్రస్తుతం భారీ హైప్ ని సంతరించుకున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్రాండ్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఊహించని హైప్ ని సొంతం చేసుకుని రేపు రాత్రి ఆటలతో మొదలు కానుంది.

అయితే ఈ సినిమాకి మొదటి నుంచి కూడా సుజీత్ లాస్ట్ వర్క్ “సాహో” తో లింక్ ఉన్నట్టుగా పలు రూమర్స్ వచ్చాయి. ఓజి సెట్స్ లో వాజి ఇంపోర్ట్స్ ఎక్స్ పోర్ట్స్ లాంటివి చూసి రెండు సినిమాలకి లింక్ ఉంది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అని కూడా గట్టి కామెంట్స్ వచ్చాయి. మరి లేటెస్ట్ గా మళ్ళీ ఈ క్రేజీ బజ్ అయితే వినిపిస్తుంది. దీని ప్రకారం రెండు సినిమాలకి లింక్ అయితే ఉందనే వినిపిస్తుంది.

కానీ ప్రభాస్ క్యామియో లాంటివి మాత్రం ఉండవట. సుజీత్ అలాంటివి లేకుండా రెండు యూనివర్స్ లకి లింక్ ని చూపించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో కానీ పొరపాటున మాత్రం లింక్ గాని ఉంటే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు లెక్కలు ఎక్కడ ఆగుతాయో చెప్పలేకపోవచ్చు. సో అది తెలియాలి అంటే ఇంకొంత సమయం ఆగక తప్పదు.

తాజా వార్తలు