కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గానే తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని నెక్స్ట్ సినిమా కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మంచి బజ్ నెలకొనగా చైతు నెక్స్ట్ ప్రాజెక్ట్ తన కెరీర్ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ పట్ల కొన్ని రోజులు నుంచి రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి.

అయితే దీనికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చేయనున్నారు అని తన దర్శకత్వం లేదా నిర్మాణంలో ఉండొచ్చు అనే టాక్ వినిపించింది. కానీ ఇవేవి నిజం కాదని చైతన్య టీం నుంచి లేటెస్ట్ క్లారిటీ వచ్చింది. ఆ రూమర్స్ లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదట. ఒకవేళ భవిష్యత్తులో ఏమన్నా ఉంటే అధికారికంగా వెల్లడి చేస్తామని చెబుతున్నారు. సో ఈ క్రేజీ కాంబినేషన్ పై ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

Exit mobile version