ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీనితో పాటుగా కొరటాల మరియు మెగాస్టార్ ల కాంబోలో వస్తున్న “ఆచార్య”లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
కానీ ఊహించని విధంగా చరణ్ కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతడు త్వరగా కోలుకోవాలని అభిమానులు బాధ పడ్డారు. అయితే చరణ్ ఆ రెండు సినిమాల తర్వాత ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఎప్పటి నుంచో మిస్టరీగా మారిన ప్రశ్న. చరణ్ నెక్స్ట్ పై చాలా మంది దర్శకుల పేర్లే వినిపించాయి.
కానీ ఇప్పుడు చర్మం తర్వాతి సినిమాకు ఓ టాలెంటెడ్ దర్శకుని పేరు ఖరారు అయ్యినట్టుగా బజ్ వినిపిస్తుంది. అతడే “మళ్ళీ రావా”, “జెర్సీ” లాంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలను అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మరి ఈ యంగ్ డైరెక్టర్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు ఇపుడు వినికిడి. మరి ఇది ఎంతవరకు నిజమో కాలమే నిర్ణయించాలి.