‘విజయ్‌ సేతుపతి’ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్ ని విజయ్‌ సేతుపతి హీరోగా పూరి ప్రకటించాడు. విజయ్ సేతుపతి పాత్రలో మూడు కోణాలు ఉంటాయని, పైగా విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా కోసం పూరి ప్రత్యేకంగా విజయ్ సేతుపతి లుక్ ను కూడా డిజైన్ చేస్తున్నాడట.

మొత్తానికి పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి.

Exit mobile version