మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి రీసెంట్ గానే వార్ 2 తో భారీ యాక్షన్ ట్రీట్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తన నుంచి సోలోగా రాబోతున్న సినిమా ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్). దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంచెం ఆలస్యంగానే మొదలైన సినిమా మొదలైన కొన్ని రోజులు షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకుంది.
అలాగే తారక్ కూడా కొత్త మేకోవర్ ఈ సినిమా కోసం చేయడం జరిగింది. కానీ ఈ మధ్య ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫాన్స్ లో కొంచెం నిరాశగా మిగిలింది. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సెప్టెంబర్ నెల లోనే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేయనున్నట్టుగా ఇపుడు టాక్. మరి ఆ అప్డేట్ ఏంటి దేని కోసం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇక ఈ భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.