లేటెస్ట్: అవైటెడ్ ‘మాస్ జాతర’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!

మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి తాను హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న రెండో చిత్రమే “మాస్ జాతర”. కొత్త దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పట్ల మంచి హైప్ ఆల్రడీ ఉంది. అయితే ఈ మే లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం వాయిదా పడింది.

ఇక కొత్త డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇపుడు ఫైనల్ గా మేకర్స్ ఆ డేట్ ని ఇచ్చేసారు. రవితేజపై ఒక మాస్ పోస్టర్ ని విడుదల చేసి ఈ ఆగస్ట్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రం విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో మాస్ ఫ్యాన్స్ ఆరోజుకి రెడీ అయ్యిపోవాలని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version