త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల కలయికలో వస్తున్న నూతన చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకు ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరోప్ లో జరుగుతుంది. అక్కడ షూటింగ్ ఈ నెల 30తో ముగుస్తుంది. దాని తరువాత ఈ సినిమా యొక్క ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ జూలై మొదటివారంలో మొదలుకావచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తున్న సమంత ” త్రివిక్రమ్ – పవన్ సినిమా ఆఖరి దశలోవుంది… ఈ సినిమా చిత్రీకరణచివరి రోజులోనేను ఏడ్చేస్తానేమో… ❤ నాకెంతో నచ్చిన బృందం … “అని ట్వీట్ ఇచ్చింది. ఈ సినిమాలో సమంత కాస్ట్యూమ్స్ కోన వెంకట్ సోదరి నీరజ డిజైన్ చెయ్యడం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం జూలై మధ్యలో విడుదల కావచ్చు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 7న విడుదలకావచ్చు