విలక్షణ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ ఇప్పటికే ‘లాస్ వెగాస్’, ‘ఈఆర్’, ‘డెస్పరేట్ హౌస్ వైఫ్’ లాంటి సినిమాల్లో నటించింది. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత లక్ష్మీ మంచు హాలీవుడ్ నిర్మాణ సంస్థలో చేస్తున్న సినిమా ‘బాస్మతి బ్లూస్’. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్ష్మీ మంచు ప్రస్తుతం యుఎస్ లో ఉంది అలాగే తన ఆర్ట్ కి సంబందించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసింది.
‘బాస్మతి బ్లూస్’ సినిమాలో బ్రీ లార్సన్, డోనాల్డ్ సతర్లాండ్, స్కాట్ బకుల కీలక పాత్రలు పోషించారు. డాన్ బారోన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మొనిక్యూ కాల్ ఫీల్డ్ నిర్మించాడు. ఈ సంవత్సరం రెండవ అర్ధ భాగంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
‘బాస్మతి బ్లూస్’ అనేది ఒక సైంటిస్ట్ కథ. ఇండియాకి వచ్చిన ఓ సైంటిస్ట్ ఇండియన్ రైస్ ని జెనెటికల్ గా మార్చిన విధానాన్ని, అందుకోసం అతను ఎదుర్కొన్న ఇబ్బందులను అలాగే ఓ లవ్ స్టొరీని ఇందులో చూపనున్నారు.