లియోనియా రిసార్ట్లలో మంచు లక్ష్మి ‘చందమామ కధలు’

Lakshmi_Manchu
‘ఎల్.బి.డబ్ల్యూ’ మరియు రొటీన్ లవ్ స్టోరీ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు కంటెంట్ పరంగా ఢొకా లేకపోయినా కమర్షియల్ గా హిట్ దక్కలేదు

ఇప్పుడు ఈ దర్శకుడు హైదరాబాద్ లియోనియా రిసార్ట్ల దగ్గర ‘చందమామ కధల’ను తీసే పనిలోవున్నాడు. ఈ ఈ సినిమా షూటింగ్ ఈరోజుతో పూర్తవ్వాల్సివుండగా కొన్ని కారణాల వలన అర్ధరాత్రి వరకూ షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సినిమా ప్రేమకధల నేపధ్యంలో ఎనిమిది వివిధభాగాలుగా విభజించి తెరకెక్కిస్తున్నారు

మంచు లక్ష్మి, కృష్ణుడు, చైతన్య కృష్ణ, సాయి కుమార్, నరేశ్, సౌమ్య ఆమని మరియు నాగ శౌరి ప్రాధాన పాత్రధారులు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు

Exit mobile version