ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మంచు లక్ష్మి !

Lakshmi-Manchu

నటి, నిర్మాత మంచు లక్ష్మి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 15 ఏళ్ల వయసులో తన జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని
ఆమె గుర్తుచేసుకున్నారు. తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి మంచు లక్ష్మి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో అమ్మే నన్ను రోజూ స్కూల్‌కి తీసుకెళ్లేది. ఐతే, బాడీ గార్డ్స్‌, డ్రైవర్స్‌ కూడా ఉండేవారు. కానీ, ఓసారి హాల్‌ టికెట్ల కోసం పాఠశాల వాళ్లే మమ్మల్ని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో తీసుకెళ్తారని తెలిసి ఎంతో ఆనందించాను. కానీ, ఆ ప్రయాణం భయంకరమైంది’ అని మంచు లక్ష్మి తెలిపింది.

ఈ విషయం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు ఉంది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో హాల్‌ టికెట్ కోసం నేను వెళ్లాను. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను చాలా అసభ్యంగా తాకాడు. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ విషయం గురించి నా స్నేహితులకు చెప్పాను. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే అలాంటి పరిస్థితి ఎదురైంది. ఇక ప్రజా రవాణాలో ప్రయాణించే సాధారణ మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటుంటారు. కానీ బయటకు చెప్పుకోలేరు’ అని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version