కృష్ణం వందే జగద్గురుమ్ విడుదల తేదీ ఖరారు


రానా, నయనతార జంటగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల నవంబర్ 9న దీపావళి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర దర్శకుడు క్రిష్ తెలిపారు. సురభి నాటకాల కుటుంబాలకి చెందిన యువకుడిగా రానా నటించగా జర్నలిస్టుగా నయనతార కనిపించబోతుంది. ఇటీవల విడుదలైన ఆడియో మరియు థియేట్రికల్ ట్రైలర్ తరువాత ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. రానా కెరీర్లోనే అత్యధికంగా ఈ సినిమాకి బిజినెస్ కావడం విశేషం. గమ్యం, వేదం వంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన క్రిష్ ఈ సినిమాలో మెసేజ్ తో పాటుగా కమర్షియల్ అంశాలను కూడా మిళితం చేసినట్లు సమాచారం. రానా పౌరాణిక డైలాగ్ డెలివరీ, క్రిష్ టేకింగ్, మణిశర్మ నేపధ్య సంగీతం వల్ల ఈ సినిమా కోసం చాల మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version