బుకింగ్స్ లో ‘కుబేర’ సంచలనం!

ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సాలిడ్ థ్రిల్లర్ కం ఎమోషనల్ డ్రామానే “కుబేర”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం స్యూర్ షాట్ హిట్ టాక్ తెచ్చుకొని అదరగొడుతుంది. అయితే మొదటి రోజు నుంచే సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అయ్యాయి.

అలాగే టాక్ రావడంతో ఈ బుకింగ్స్ ఇపుడు ప్రముఖ బుకింగ్స్ యాప్ బుక్ మై షోలో ఊపందుకున్నాయి. ఇలా ఒకరోజు అయ్యి రెండో రోజు పూర్తి కాకుండానే ఏకంగా హాఫ్ మిలియన్ టికెట్స్ ని కుబేర క్రాస్ చేసేసి అదరగొట్టింది. దీనితో ఈ సినిమా పట్ల ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఆసక్తిగా ఉన్నారో మనం అర్దం చేసుకోవచ్చు.

మరి ఈ వీకెండ్ కి కుబేర ఎలాంటి రెస్పాన్స్ ని కొల్లగొడుతుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్నా కూడా మంచి పాత్ర పోషించగా హిందీ నటుడు జిమ్ షర్బ్ నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం మరో హైలైట్ గా నిలవగా అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.

Exit mobile version