రొటీన్ కి భిన్నంగా వైవిధ్యమైన సినిమాలు తీసే డైరెక్టర్ క్రిష్ తీసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని మరియు ఆ సినిమాకి అశ్వినీదత్ నిర్మాత అని ఖరారు చేసారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధాన మిచ్చిన క్రిష్ ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులు కూడా చాలా వరకూ పూర్తయ్యాయని తెలిపారు.
ఈ 100% కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా 2013 సమ్మర్లో మొదలు కానుంది. అలాగే ఈ సినిమాకి అది టైటిల్ ఇది టైటిల్ అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ అవన్నీ వర్కింగ్ టైటిల్స్ మాత్రమే ఇంకా టైటిల్ ఖరారు కాలేదు అని అన్నారు. మహేష్ బాబు తో క్రిష్ సినిమా చేయనున్నాడు అనేది ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఇది 2013లో ఆసక్తి కరమైన ప్రాజెక్ట్ కానుంది.