
గత కొన్నాళ్ల కితం అక్కినేని నాగార్జున అలాగే అక్కినేని కుటుంబం విషయంలో తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ చేసిన పలు సంచలన కామెంట్స్ కోసం అందరికీ తెలిసిందే. దీనితో అక్కినేని నాగార్జున న్యాయస్థానం మెట్లు ఎక్కడం కూడా జరిగింది. అయితే ఫైనల్ గా కాంట్రవర్సీపై కొండా సురేఖ అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి అందించారు.
తనకి నాగార్జున గారిని కానీ అక్కినేని కుటుంబాన్ని కానీ హర్ట్ చేసే ఉద్దేశం లేదని తన మాటలు వారిని బాధించి ఉంటే అందుకు తాను చింతిస్తున్నాను అని అలాగే తన మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని కొండా సురేఖ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలియజేసారు. దీనితో వీరి కాంట్రవర్సీ విషయంలో ఒక తుది తీర్పు వచ్చినట్టే అని చెప్పాలి. మరి దీనిపై కింగ్ నాగ్ నుంచి కానీ వారి కుటుంబం నుంచి కానీ ఏమన్నా వస్తుందేమో చూడాలి.

