దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదిచుకున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియన్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని సెప్టెంబర్ 9న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర దర్శకురాలు, రజినీ కుమార్తె సౌందర్య అశ్విన్ తెలిపింది. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్న రజినీ అభిమానులకు ఇదొక శుభవార్త.
ఈ మూవీ కోసం ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందిన టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అలాగే అవతార్ మూవీకి పనిచేసిన స్టీరియోస్కోపిక్ టీం ఈ సినిమా కోసం పనిచేసారు. దీపిక పడుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటులైన శరత్ కుమార్, ఆది, శోభన, జాకీ ష్రాఫ్, నాజర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.