యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘క’ తర్వాత ‘దిల్రూబా’ అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన కల్ట్ చిత్రం అయిన ‘బేబీ’ మేకర్స్‌తో చేతులు కలిపి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో మన ముందుకు రాబోతున్నాడు. ‘బేబీ’ చిత్ర నిర్మాత SKN, దర్శకనిర్మాత సాయి రాజేష్ మరో ప్రేమకథతో ఓ సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాను వీరు రూపొందిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తూ, SKNతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో హీరో కిరణ్ అబ్బవరం క్లాస్ లుక్‌లో కనిపించాడు. ఇక హీరోయిన్గా గౌరీ ప్రియ నటిస్తుండగా తొలి ప్రేమ పై వీరిద్దరు మాట్లాడుకుంటున్నారు. తొలిప్రేమ ఎంత గొప్పదని హీరోయిన్ అంటే, తొలిప్రేమ తోపేం కాదు అని హీరో అంటున్నాడు.
ఈ సినిమాలో తొలి ప్రేమ ఫెయిల్యూర్ తర్వాత వచ్చే నిజమైన ప్రేమకు సంబంధించిన కథను మనకు చూపెట్టబోతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి మరో కల్ట్ చిత్రాన్ని త్వరలో మనకు అందించేందుకు బేబీ మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాను రవి నంబూరి డైరెక్ట్ చేస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు.