‘దిల్ రూబా’ ట్రైలర్ టాక్.. యాక్షన్ ప్యాక్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్

‘దిల్ రూబా’ ట్రైలర్ టాక్.. యాక్షన్ ప్యాక్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్

Published on Mar 6, 2025 5:19 PM IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘దిల్ రూబా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు విశ్వ కరుణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాయి. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాలేజీ లైఫ్‌లో సాగే లవ్ స్టోరీ మనకు ఈ సినిమాలో మరోసారి చూపెట్టబోతున్నారు. అయితే, హీరోకి ముక్కుమీద కోపం ఉండటం.. అతనికి గతంలోనే ఓ ప్రేమకథ ఉండటం.. తన మాజీ ప్రియురాలు మరోసారి అతని జీవితంలోకి రావడంతో అతడి లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తిప్పుకుంటుందా.. అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్‌గా ఉంటుందని ఈ ట్రైలర్ ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు.

రొమాన్స్‌తో పాటు యాక్షన్ డోస్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుందని ఈ ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఇక కిరణ్ అబ్బవరం మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో రుక్సర్ ధిల్లోన్, కేథి డేవిసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య, దయానంద్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 14న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు